బంగారం ధరలు

By సుభాష్  Published on  27 April 2020 4:17 AM GMT
బంగారం ధరలు

పసిడి ధరలు ఈ రోజు కడా పెరిగాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో అక్షయ తృతీయ రావడంతో బంగారం కొనుగోలుదారులు లేక షాపులన్నీ వెలవెలబోతున్నాయి. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో పసిడి ధరలు అమాంతంగా పెరిగిపోయేవి. కానీ లాక్‌డౌన్‌ ఎఫెక్టుతో ధరలు స్వల్పంగా పెరిగాయి.

ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలలో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరర రూ. 45,930 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,620 ఉంది.

ఇక ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,040 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 43,130వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇక వెండి ధర వరుసగా నాలుగు రోజులుగా అతిస్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.42,600 ఉండగా, ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అదే ధర కొనసాగుతోంది.

ఇక బంగారం పెరుగుదలకు చాలా కారణాలున్నాయనే చెప్పాలి. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు జువెలరీ మార్కెట్‌ తదితర కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Next Story