నేడు ఆకాశంలో బ్లూ మూన్.. ఈ పేరు ఎలా వచ్చిందంటే..!
By సుభాష్ Published on 31 Oct 2020 2:49 PM ISTఈనెల 31వ తేదీన ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. చందమామ నిండుగా కనిపించనున్నాడు. 31న ఆకాశంలో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ప్రజలంతా బ్లూ మూన్ వీక్షించవచ్చు. ఇది అక్టోబర్ నెలలో రెండు పౌర్ణమి కావడంతో దీనిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. బ్లూమూన్‌ను కొన్ని దేశాల్లో హంటర్ మూన్‌గా అని పిలుస్తారు. చలికాలంలో రాత్రి పూట జంతువులను వేటాడడానికి వేటగాళ్లుకు ఈ పౌర్ణమి సహకరిస్తుంది. అందుకే దీనిని హంటర్ మూన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ బ్లూ మూన్ అనేది సాధారణంగా ప్రతీ రెండు లేదా మూడు సంవత్సరాలకోసారి మాత్రమే ఏర్పడుతుంది. గతంలో 2018లో ఈ బ్లూమూన్ ఏర్పడగా, ఈనెల 31న ఏర్పడనుంది. ఈ ఏడాది తర్వాత బ్లూ మూన్ తిరిగి 2039లో ఏర్పడనుంది.
బ్లూ మూన్ అంటే ఏమిటీ..?
ఈ ఏడాది తర్వాత బ్లూ మూన్ మళ్లీ 2039లో ఏర్పడనుంది. అందుకే ఈ సారి అందరూ చూడాల్సిందే. ఒక నె లలో రెండు పౌర్ణమిలు ఏర్పడితే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. అయితే బ్లూ మూన్ రోజు చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు. అగ్ని పర్వత విస్పోటనం, అడవి మంటల వల్ల చంద్రుడు కొన్ని సార్లు రంగుమారుతున్నట్లు అనిపిస్తుంది అంతే.
బ్లూ మూన్ అని పేరు ఎలా వచ్చింది..?
బ్లూ మూన్ అని పేరు ఎలా వచ్చిందని చాలా మందిలో సందేహం వ్యక్తం అవుతుంటుంది. చంద్రుడు ఏడాదికి 12 సార్లు పెద్దగా దర్శనిమిస్తుంటాడు. అలా ప్రతి పౌర్ణమి చంద్రుడికి ఒక పేరు పెట్టడం ప్రారంభించారట. ఈ క్రమంలో ఈ సీజన్‌లో మూడో పౌర్ణమికి బ్లూ మూన్ అనే పేరు వచ్చింది. నెలలో వచ్చే రెండు పౌర్ణమికి ఇలా ప్రత్యేకమైన పేరు ఉందనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం సీజనల్ బ్లూ మూన్, నెలవారీ బ్లూమూన్ ఉన్నాయి. ఈ రోజు దర్శనమిచ్చే బ్లూ మూన్ నెలవారీది.
నాసా వివరాల ప్రకారం..
అయితే ఈ బ్లూ మూన్ వెనుక మరో పేరు కూడా ప్రచారంలో ఉంది. ఒకనొక బ్లూ మూన్ అనే పదబంధం నంచి ఇంది పుట్టిందని తెలుస్తోంది. నాసా ప్రకారం. 1883లో ఇండోనేషియాలోని క్రాకాటోవా అనే అగ్ని పర్వతం పేలి భారీ ఎత్తున వెలువడిన బూడిద ఆకాశంలోకి చేరిందని, ఈ బూడిద మేఘాలలోని కణాలు చంద్రునిలోని ఎరుపు రంగును చెదరగొట్టాయి. దాంతో చంద్రుడు నీలం రంగులో దర్శనమిచ్చింది. దీన్ని నాసా అరుదైన ఘటనగా పేర్కొంది. అప్పటి నుంచి బ్లూ మూన్ః పదం వాడుకలో ఉందని సమాచారం.