తెలంగాణ ఎన్జీవోల క్రీడా పోటీల్లో విషాదం..

 Published on  7 Feb 2020 3:23 PM GMT
తెలంగాణ ఎన్జీవోల క్రీడా పోటీల్లో విషాదం..

నిజామాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ ఎన్జీవోల క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ఆడుతూ ఓ ఉద్యోగి కుప్పకూలాడు. తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్ మైదానంలో తెలంగాణ ఎన్జీవోల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం కబడ్డీ పోటీల్లో.. సురేష్ అనే ఉద్యోగి కబడ్డీ ఆడుతూ.. కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు సురేష్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి పంచాయతీ కార్యదర్శిగా సురేశ్ పనిచేస్తున్నాడు. సురేష్‌ మృతితో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది.

Next Story
Share it