తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త

ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on  14 July 2024 8:30 AM IST
ttd,  action,  mediators, darshan, room booking,

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త

ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు తిరుమల దేవస్థానంపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టింది. టీటీడీ ఈవోను మార్చిన తర్వాత అవకతవకలను గుర్తించి వాటిని సరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనం, వసతికి సంబంధించిన అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, దర్శనం, గదుల కేటాయింపులో దళారులు భక్తులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై టీటీడీ దృష్టి సారించింది. భకత్లుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం, వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా వ్యవహించేలా చూస్తోంది.

తిరుమల సేవలు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి. అయితే.. చాలా మంది దళారులు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల బుకింగ్‌లపై ఇటీవల విచారణ జరిపింది టీటీడీ. ఇక ఆఫ్‌లైన్‌లో ఎస్ఎస్‌డీ టోకెన్లు, వసతి సేవల బుకింగ్‌లపైనా విచారణ చేసింది. ఒకే మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌ను ఉపయోగించి భారీగా బల్క్‌ బుకింగ్స్ చేసినట్లు గుర్తించారు. 110 గదులు పొందినట్లు గుర్తించారు. మరో మొబైల్‌ నెంబర్‌తో ఏకంగా 807 గదులు బుకింగ్‌ అయ్యాయని చెప్పారు. మెయిల్‌ను ఉపయోగించి ఆన్‌లై ద్వారా 926 వసతి గదులు బుక్‌ చేశారని చెప్పారు.

ఒకే మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఒక ఏడాదిలో 1279 డిప్ రిజిస్ట్రేషన్‌లు.. ఒకే మెయిల్ ఐడీని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్‌లు.. ఒకే ఐడీ ప్రూఫ్‌ని ఉపయోగించి 14 ఎస్ఎస్‌డీ సర్వదర్శనం టోకెన్లు పొందినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీనిపై విచారణ చేపడుతున్నామనీ.. చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

అయితే.. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నట్లు చెప్పారు టీటీడీ అధికారులు. తద్వారా దళారులు లేకుండా పారదర్శకంగా సేవలు అందుతాయని చెప్పారు.

Next Story