టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 9:00 AM GMTటీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి శుభవార్త తెలిపింది. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు.. జనవరిలో మరో 1500 మందికి కూడా ఇంటిపట్టాలు ఇచ్చేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగులతో పాటు తదితరుల కోసం మరో 350 ఎకరాలను రూ.80 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శానిటేషన్ ఉద్యోగులు, వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను కూడా పెంచనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. పోటు కార్మికుల వేతనాలను రూ.28వేల నుంచి రూ.38వేలకు పెంచాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒకేసారి వారికి రూ.10వేల పెంపు లభించనుంది. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన విధంగా వేతనాలను పెంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. కల్యాణకట్టలో పీఎస్ రేట్ బార్బర్ల వేతనం కీనం రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతిలో పాత సత్రాలను తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది టీటీడీ పాలక మండలి.
ఇక తిరుపతి పారిశుద్ధ్యం పనులు కోర్టు తుది తీర్పునకు లోబడి ఆమోదించాలని టీడీపీ పాలకమండి అభిప్రాయపడింది. జార్ఖండ్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరా్లోల వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే చంద్రగిరి మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రూ.2కోట్లు కేటాయించింది. శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300 ప్రత్యేక దర్శనం కల్పించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ పెద్ద జీయార్, చిన్న జీయార్ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో రూ.కోటి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.