తిరుమల కొండపై త్వరలో ప్రైవేట్ హోటల్లో కనిపించవు అంటూ రెండు వారాల క్రితమే టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయంతో ముందుకొచ్బింది. రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి దేవాలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో గిరిజన, ఎస్సి, బిసి ప్రాంతాల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు. నగరి ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి మేరకు 3.4 కోట్లతో నిర్మించిన టిటిడి కళ్యాణ మంటపాన్ని ఈ రోజు రోజా తో కలిసి వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. మూడు అంతస్తుల్లో కళ్యాణ మండపం నిర్మించామని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. సకల సదుపాయాలతో తక్కువ అద్దెకు 700 మంది ఆహ్వానితులు తో ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు అని పేర్కొన్నారు సుబ్బారెడ్డి.