తిరుమల: తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో స్వామివారిని భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనానికి భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్ సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయాన్ని మాత్రమే పడుతోంది. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న శ్రీవారిని 74,533 మంది భక్తులు దర్శించుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story