శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..!

By Newsmeter.Network  Published on  27 Nov 2019 8:03 AM GMT
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..!

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త అందించనుంది. ఆలయంలో శ్రీవారి భక్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైకుంఠ ద్వారాలను ఏకంగా 10 రోజులపాలు తెరిచి వుంచాలని టీటీడీ భావిస్తోంది.

ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులోనే భక్తులును వైకుంఠ ద్వారం గూండా దర్శనానికి అనుమతిస్తారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీలైనంత ఎక్కువమందికి వైకుంఠ దర్శనం కల్పించేందుకు టీటీడీ సన్నాహకాలు చేస్తోంది. ఈ మేరకు 10 రోజులు పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలును తెరవాలని టీటీడీ ప్రతిపాదించింది. ఈ మేరకు టీటీడీ ఆగమ సలహా మండలి కూడా అంగీకారం తెలిపింది. కానీ.. ఈ నూతన విధానాన్ని పాలక మండలి కూడా ఆమోదం తెలపాల్పి ఉంది. పాలకమండలి ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే విధానం అమల్లోకి రానుంది. దీంతో వీలైనంత ఎక్కువమంది భక్తులు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకునే వీలుంటుంది.

Next Story