తప్పుడు ప్రచారాలు చేసినవారిపై క్రిమినల్ కేసులు: టీటీడీ చైర్మన్‌

By Newsmeter.Network  Published on  1 Dec 2019 3:26 PM GMT
తప్పుడు ప్రచారాలు చేసినవారిపై క్రిమినల్ కేసులు: టీటీడీ చైర్మన్‌

ఎంతో ప్రముఖ్యత కలిగి అతిపెద్ద హిందూ దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానంపై అన్యమత ముద్ర వేస్తూ ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురణ చేయడం దురదృష్టకరమని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని దేవుడు కూడా క్షమించడని అన్నారు. అన్ని మతాల వారు ఓట్లు వేసి వైసీపీని గెలిపించారని, ఆ ప్రముఖ దినపత్రిక యాజమాన్యం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమ్మక్కై మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హైర్డ్ సోషల్ మీడియాతో శేషాచలం అడవిలో చర్చి నిర్మించామని గతంలో టీడీపీ దుష్ప్రాచారాలు చేసిందని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు సుబ్బారెడ్డి. టీటీడీ ప్రతిష్ట దిగజార్చి, తప్పుడు ప్రచారాలు చేసినవారి పై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అలాగే వైకుంఠ ద్వారాలు పది రోజులు తెరుస్తామని టీటీడీ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. టీటీడీ త్వరగా సైబర్ క్రైమ్ వింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు.

Next Story