ఉచితంగా శ్రీవారి లడ్డూలు..
By రాణి Published on 21 March 2020 11:54 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిప్రభావంతో భారత్ లోని అన్ని ప్రధాన ఆలయాలను మూసివేశారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన ఆలయాల్లోకి భక్తుల రాకను ఆపివేశారు అధికారులు. తిరుమల వెంకన్న ఆలయంలో కూడా భక్తుల రాకను నిలిపివేశారు. దర్శనాలను ఆపివేయడంలో తిరుమలగిరిలోని కాంప్లెక్స్ లన్నీ ఖాళీ అయ్యాయి. కేవలం స్వామివారికి జరగాల్సిన పూజా కైంకర్యాలను మాత్రం నిర్వహించేందుకు అర్చకులను అనుమతిస్తున్నారు.
Also Read : ఇటలీలో చేయిదాటిపోయిన పరిస్థితి
కాగా..తిరుమల లడ్డూకు దేశంలోనే కాదు..ఇతర దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎప్పుడూ అదనంగా లడ్డూల తయారీ జరుగుతూనే ఉంటుంది. కానీ.. ఈసారి మాత్రం భక్తుల రద్దీని అదృష్టిలో పెట్టుకుని తయారు చేసిన 2 లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి. రెండు వారాల వరకూ భక్తులను అనుమతించే ప్రసక్తే లేదు. అందుకే ఈ లడ్డూలను ఉచితంగా పంచిపెట్టాలని తితిదే నిర్ణయించింది. ఉగాది కానుకగా ఈ రెండు లక్షల లడ్డూలను ఆలయ సిబ్బందికే ఉచితంగా అందజేయనుంది.
Also Read : జనతా కర్ఫ్యూ వల్ల ఫలితమేంటి..? కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చా..?