తిరుమలలో సూర్యజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం రథసప్తమి సందర్భంగా మలయప్పస్వామి సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో స్వామివారికి వాహన సేవ ప్రారంభమైంది. ఆ తర్వాత చిన్నశేష, గరుడ, హనుమంత, చక్రస్నానం, కల్పవృక్ష, సర్వభూపా, చంద్రప్రభ వాహనాలపై కోనేటిరాముల వారు దర్శనమిస్తారు. అలాగే..రథసప్తమి సందర్భంగా శ్రీవారికి ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

రథసప్తమి, వారాంతం కావడంతో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోవడంతో..భక్తులు క్యూలైన్ల వెలుపల బారులు తీరారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.