శ్రీవారి దర్శనం నిలిపివేత : గడువు పెంచిన టిటిడి

By రాణి  Published on  30 March 2020 11:33 AM GMT
శ్రీవారి దర్శనం నిలిపివేత : గడువు పెంచిన టిటిడి

దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం 1100 కు చేరువలో కరోనా బాధితుల సంఖ్య ఉంది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 27 మంది కరోనా బాధితులు చనిపోగా..రెండు మరణాలు తెలంగాణలోనే నమోదయ్యాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో టిటిడి శ్రీవారి దర్శనాలను ఏప్రిల్ 14వ తేదీ వరకూ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 19వ తేదీన టిటిడి అత్యవసర సమావేశంలో నెలాఖరు వరకూ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే రోజు కొండపైనున్న భక్తులందరినీ ఖాళీ చేయించి ఘాట్ రోడ్డులను మూసివేసింది.

Also Read : టిటిడి సంచలన నిర్ణయం

కాగా..భక్తులను 14వ తేదీ తర్వాత స్వామి వారి దర్శనానికి అనుమతించేదీ లేనిది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని టీటీడీ పేర్కొంది. స్వామివారి పూజా కైంకర్యాలు మాత్రం యథాతథంగా జరుగుతాయని వెల్లడించింది. కరోనా ప్రభావంతో తిరుపతిలో తిండి లేక ఆకలితో అలమటిస్తున్న 50 వేల మందికి భోజనం అందిస్తోంది. దేవస్థానానికి వెళ్లే రెండు కనుమ మార్గాలను మూసివేసింది. వారంరోజులపాటు టిటిడి సిబ్బంది షిఫ్ట్ ల వారిగా విధులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి నిర్వహించాల్సిన హనుమంత వాహన సేవను కూడా రద్దు చేసింది. అలాగే స్వామివారి వార్షిక వసంతోత్సవాలను కూడా కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.

Also Read :సిసిసి కి ప్రభాస్, బన్నీ విరాళం

Next Story