'తిప్ప‌రా మీసం' పెద్ద విజ‌యం సాధించాలి.. - వి.వి.వినాయ‌క్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 10:55 AM GMT
తిప్ప‌రా మీసం పెద్ద విజ‌యం సాధించాలి.. - వి.వి.వినాయ‌క్

శ్రీవిష్ణు హీరోగా నిక్కి తంబోలి హీరోయిన్ గా అసుర ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో తెరకెక్కుతుంది 'తిప్ప‌రా మీసం' మూవీ. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో ఈ మూవీ వస్తుంది. యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం ' తిప్పరా మీసం'. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

ఈ చిత్రం ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 3న హైదరాబాద్ దసపల్ల హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం.యల్ కుమార్ చౌదరి, హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు హాజరయ్యారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.

సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ మాట్లాడుతూ:

'తిప్పరా మీసం' టీమ్ అందరికీ మంచి పేరు, నిర్మాతలకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీ విష్ణు ఆడియన్స్‌లో, ఇండస్ట్రీలో మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నారు. నాకు శ్రీ విష్ణు ‘బ్రోచేవారెవరువా’సినిమా విపరీతంగా నచ్చి ఒక మూడు సార్లు అయినా చూసి ఉంటాను . మంచి కథ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ గా తెలిసిన హీరో. మంచి టీమ్, కథలతో సినిమాలు తీస్తున్నారు. టీమ్ అందరికీ అల్ ది బెస్ట్ అన్నారు.

ప్రముఖ నిర్మాత యం. యల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ:

'తిప్పరా మీసం టైటిల్ కమర్షియల్ గా, అద్భుతంగా ఉంది. విష్ణు గత సినిమాలు చూస్తే ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఉంటుంది . అలాగే లిమిటెడ్ బడ్జెట్ లో ఉంటుంది. సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నారు. అలాగే విజయ్ కృష్ణ 'అసుర' లాంటి అద్భుతమైన సినిమా తర్వాత దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ గారు మంచి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. నేను వచ్చిన కొత్తలో 'ఇడియట్' అనే మూవీ తీశాను. అది ఎంత పెద్ద హిట్ అయిందో.. ఈ సినిమా రిజ్వాన్ గారికి అంత పెద్ద హిట్ అవ్వాలి' అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ…

'తిప్పారా మీసం' చాలా పవర్ ఫుల్ మాస్ టైటిల్.. ఇలాంటి మాస్ టైటిల్ తో చేసిన ఈ ఫంక్షన్ కి వినాయక్ గారిలాంటి మాస్ డైరెక్టర్ గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. నేను ఇప్పటి.వరకు చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉంటుంది. ప్రపంచంలో ఏదైనా మారొచ్చేమో గాని అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. అలాంటి మదర్ సెంటిమెంట్ తో చేసిన ఈ చిత్రం అందరికీ మంచి ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుందన్నారు.

Next Story