ఓపెన్ కాస్ట్ ఏరియాలో పులి సంచారం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 May 2020 2:17 AM GMT
ఓపెన్ కాస్ట్ ఏరియాలో పులి సంచారం

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. తిర్యాణి మండలం ఖైరిగుడాలో పులి సంచ‌రించింది. ఓపీసీ విధులకు వెళ్తున్న డ్రైవర్లకు డిబిఎల్ ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతంలో పులి ఆడవిలోంచి రోడ్డు పైకి వస్తూ కనిపించింది. భయంతో సిబ్బంది పరుగులు తీశారు. పులి రాక‌ను గ‌మ‌నించిన‌ ఒకరు తన మొబైల్ ఫోన్ లో పులి చిత్రాలను బంధించారు.

జ‌నావాసాల‌కు ద‌గ్గ‌ర‌లో పులి తిరుగుతుండ‌టంతో స్థానికులు తీవ్ర భయాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌తనెల రోజుల వ్య‌వ‌ధిలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్‌, పెంచిక‌ల్‌పేట‌ అడ‌వుల్లో పులి సంచ‌రిస్తున్న‌ట్లు ఆన‌వాళ్లు క‌నిపించాయి. తాజాగా పులి క‌నిపించ‌డంతో స్థానికులు మరింత భయాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స్థానికులెవ్వ‌రూ భ‌యాందోళ‌న‌కు గురికావద్దని అట‌వీ శాఖ అధికారులు చెబుతున్నారు.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-20-at-11.34.19-PM.mp4"][/video]

Next Story