పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలులో బ్యానర్లు కట్టేందుకు వెళ్లిన అభిమానులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తించారు. తీవ్ర గాయాలైన మరో ముగ్గురు హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యంలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా శాంతిపురం మండలం కడపల్లికి చెందిన వారుగా గుర్తించారు. కాగా, 25 అడుగుల ఎత్తున బ్యానర్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాక్ తగిలింది.