హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్లకు సోకిన కరోనా

By రాణి  Published on  26 March 2020 10:09 AM GMT
హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్లకు సోకిన కరోనా

కరోనా వైరస్ సోకిన బాధితులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లకే కరోనా సోకింది. దోమలగూడకు చెందిన ఓ డాక్టర్ (43) కు కరోనా సోకినట్లు నిర్థారణయింది. డాక్టర్ తో పాటే కలిసి ఉంటున్న భార్యకు కూడా కరోనా టెస్ట్ లు చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుడి భార్య కూడా వైద్యురాలే కావడం బాధాకరం. దేవుళ్లు వైద్యుల రూపంలో మనుషులకు వచ్చిన వైరస్ ను నయం చేస్తున్నారని కొనియాడుతున్నాం. కానీ..ఆ వైద్య దేవుళ్లకే వైరస్ వస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Also Read : కరోనా రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

అలాగే కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు నిర్థారణయింది. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా..ఈ వ్యక్తి కొన్నాళ్లు అతనితో కలిసి ఉండటం వల్లే కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఒకే రోజు హైదరాబాద్ లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో భాగ్యనగర వాసులు భయపడుతున్నారు. గురువారానికి తెలంగాణ కరోనా బాధితుల సంఖ్య 44కి చేరింది. బుధవారం రాత్రి కూడా 3 ఏళ్ల బాలుడికి కరోనా నిర్థారవ్వడంతో..తెలంగాణ ఉలిక్కిపడినంత పనైంది. దేశంలో అతి చిన్న వయసులో కరోనా సోకిన వ్యక్తి ఈ బాలుడే.

Also Read : హాస్టళ్లు మూసేస్తే కఠిన చర్యలు – డీజీపీ

Next Story