గంజాయి మత్తులో యువకుడు వీరంగం

By సుభాష్  Published on  30 Jan 2020 2:28 PM GMT
గంజాయి మత్తులో యువకుడు వీరంగం

గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. విజయవాడలోని షాపర్స్ షాపింగ్‌ మాల్‌ వద్ద యువకుడు గంజాయి సేవించి షాప్‌లోకి వెళ్లి విలువైన వాచ్‌ను తీసుకెళ్తుండగా, అక్కడున్న సెక్యూరిటీ అడ్డుకున్నాడు. దీంతో సదరు యువకుడు సెక్యూరిటీపై ఎదురుదాడికి దిగాడు. మత్తులో ఉన్న యువకుడు వారిపై ఘర్షణకు దిగాడు. మత్తులో ఉన్న అతన్ని సెక్యూరిటీ సముదాయించినా వినకపోయే సేరికి షాప్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో షాపు వద్దకు చేరుకున్న పోలీసులను సైతం చెమటలు పట్టించాడు. గంట పాటు నానా హంగామా చేశాడు. నాపేరు విక్టరి విక్కి, నేను సాఫ్ట్ వేర్‌ ఉద్యోగిని, నాకు 200 కోట్ల ఆస్తి ఉందంటూ పోలీసుల ముందు నానా హంగామా సృష్టించాడు. పోలీసులను సైతం లెక్క చేయకుండా ఎదురు మాట్లాడాడు. దీంతో పది మంది పోలీసులు రంగంలోకి దిగి సదరు యువకున్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువకుడు గంజాయి ఎక్కడ సేవించాడు, ఎక్కడి నుంచి వచ్చాడని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Next Story
Share it