వెంకీ మామ టీజ‌ర్ వ‌చ్చేసింది. ఇంత‌కీ ఎలా ఉంది..?

By Newsmeter.Network  Published on  9 Oct 2019 2:24 PM GMT
వెంకీ మామ టీజ‌ర్ వ‌చ్చేసింది. ఇంత‌కీ ఎలా ఉంది..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ సామ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీ మామ‌'. 'జై ల‌వ‌కుశ 'ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ మూవీకి సంబంధించి చిన్న‌సైజ్ టీజ‌ర్ రిలీజ్ చేసారు.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే... ఫస్ట్ షాట్‌లోనే వెంకటేష్ మోటార్ బైక్ పై 'జై జవాన్, జై కిసాన్' అనే బోర్డు చూపించి ఈ సినిమా పాయింట్ ఏంటి అనేది చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇక ఈ టీజర్ అంతా కూడా వెంకీ హవా సాగింది. రెండు డైలాగ్స్ కూడా వెంకటేష్ మీదే కట్ చేశారు. ఒకసారి పవర్ ఫుల్‌గా డైలాగ్ చెప్పి ఫైట్ చేసిన వెంకీ మరొక చోట 'ఐ లవ్ యు ' అని ఉబ్బితబ్బిబవుతూ కామెడీ పండించాడు.

చైతూని అల్లుడు అని పిలుస్తూనే డైలాగ్స్ చెప్పాడు వెంకటేష్. చైతూని అలా పిలుస్తుంటే... విన‌డానికి.. చూడ‌డానికి చాలా బాగుంది. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి అనే ఫీలింగ్ క‌లిగించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే... 'వెంకీమామ 'సినిమా పై అంచ‌నాల‌ను పెంచేశాడు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేట‌ర్ లో చూస్తామా అని అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు అంటే ఈ సినిమా పై క్రేజ్ ఎంతుందో అర్ధం చేసుకోవ‌చ్చు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Next Story