శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి గరిష్టస్థాయి నీటిమట్టం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 10:18 AM GMT
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి గరిష్టస్థాయి నీటిమట్టం

నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రధాన కాల్వ ద్వారా నీటిని కిందకు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 39 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 84.841 టీఎంసీలకు నీరు చేరింది. గరిష్ట స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులుగా ఉంది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేశారు. మరో 15 రోజుల పాటు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి స్వల్ప వరద రానుంది. లోయర్‌ మానేరు డ్యామ్‌లో కూడా నీటి నిల్వ 19 టీఎంసీలకు చేరుకుంది. శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, లోయర్‌ మానేరు ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది.

Next Story