ప్రపంచంలోనే అతిపెద్ద కొమ్ముల ఆవు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 6:18 AM GMT
ప్రపంచంలోనే అతిపెద్ద కొమ్ముల ఆవు..!

ప్రపంచంలోనే అతి పొడవైన కొమ్ములు కలిగిన ఆవును గుర్తించారు. ఓక్లహోమాలోని లాటన్‌ పట్టణంలో ఉన్న ఈ ఆవును ‘బకుల్‌హెడ్‌’ అని పిలుస్తారు. ఈ ఆవు కొమ్ముల పొడవు 11 అడుగుల 1.8 అంగుళాలు. ఈ గోవు వయస్సు ఆరేళ్లు మాత్రమే. వయసు తక్కువైనప్పటికీ కొమ్ములు మాత్రం పెద్దవే. అందుకే గిన్నిస్ రి కార్డు ఎక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020లో ఇది గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కనుంది. ప్రస్తుతం అలబామాలోని గుడ్‌వాటర్‌ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఆవు గిన్నీస్‌ రికార్డుల్లో కొనసాగుతోంది. పొంచోవియా పేరుతో పిలుస్తున్న ఆ ఆవు కొమ్ముల పొడువు 10 అడుగుల 7.4 అంగుళాలు.

Next Story