ఆ బిడ్డను న్యాయమూర్తి ఎందుకు ఎత్తుకున్నాడంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 12:51 PM GMT
ఆ బిడ్డను న్యాయమూర్తి ఎందుకు ఎత్తుకున్నాడంటే..!

వాషింగ్టన్‌: అమ్మ అవడం ఏ స్త్రీ అయినా గొప్ప వరంగా భావిస్తుంది. అలాగే ఓ తల్లి తన వృత్తి జీవితంలో అడుగు పెట్టే క్షణంలో.. తన గారాల పట్టి తన దగ్గరే ఉండటం ఒక వర్ణనాతీతమైన అపూర్వ భావన. ఆ తీపిని కళ్లకు కట్టే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక మహిళ తను న్యాయవాద వృత్తిని స్వీకరిస్తూ ప్రమాణం చేస్తున్న క్షణాన ఆమె బిడ్డను న్యాయమూర్తి ఎత్తుకున్నాడు.

ఈ సంఘటన అమెరికా, వాషింగ్టన్‌ లోని స్టేట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ జడ్జి రిచర్డ్‌ డింకిన్స్‌ ఆ చిన్నారిని ఒక చేత్తో ఆడిస్తూ, జులియానా లామర్‌ అనే మహిళ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించే ప్రమాణ పత్రాన్ని చదవడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. మహిళలు తమ సంపూర్ణ జీవితాన్ని జీవించే విధంగా చేయూతనివ్వడానికి ఈ చర్య ఓ గొప్ప ఉదాహరణ అంటూ.. న్యాయమూర్తి మానవీయ చర్యను కొనియాడుతూ.. జులియానాను హీరో అంటూ నెట్‌ ప్రపంచం పొగుడుతోంది.

11111

Next Story