విడుదలకు సిద్దమైన " సంహారిణి "

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 6:26 AM GMT
విడుదలకు సిద్దమైన  సంహారిణి

శ్రీ లక్ష్మీ వృషద్దరి ప్రొడక్షన్స్, గీత ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రాధికా కుమార స్వామి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం " సంహారిణి ". ఈ చిత్రంలో 1980 లో ఒక రాజు కుటుంబంలో జరిగే కథ 2019 లో కూడా కొనసాగుతుంది. హారర్, కామెడీ, థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహించారు. రాజు కుమార్తె దమయంతి పాత్రలో రాధికా కుమారస్వామి నటించారు, అలాగే రాజు పాత్రలో తమిళ సీనియర్ నటుడు నటించాడు. ఈ పాత్ర పేరు రాజ బహుదూర్ విజయేంద్ర వర్మ.

షూటింగ్‌ స్పాట్స్‌:

ఈ చిత్రాన్ని బెంగళూర్‌, మైసూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ చిత్రం కోసం మూడు అద్భుతమైన భారీ సెట్స్ వేశారు. విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్స్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీలో సందర్భానుసారం మూడు పాటలు ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అయితే చిత్రం విడుదల ముందు ఆడియో విడుదల చెయ్యనున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు: రాధిక కుమారస్వామి, భజరంగి లోకి, సాధు కోకిల, తబల నాని, మిత్ర, సాంకేతిక నిపుణులు: మ్యూజిక్: ఆర్.ఎస్. గణేష్ నారాయణ్, కెమెరామెన్: పి.కె.హెచ్.దాస్, ఎడిటింగ్: మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీ లక్ష్మీ వృశుద్ధరి ప్రొడక్షన్స్, కథ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవరసన్.

Next Story