విజయారెడ్డి హత్యకు నిరసన వ్యక్తం చేస్తున్న.. వీఆర్వోను నిలదీసిన మహిళా రైతు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 7:38 AM GMT
విజయారెడ్డి హత్యకు నిరసన వ్యక్తం చేస్తున్న.. వీఆర్వోను నిలదీసిన మహిళా రైతు

యదాద్రి భువనగిరి: ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు నిరసనగా... రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ అధికారులు తహశీల్దార్ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గుండాల తహశీల్దార్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అయితే వీఆర్వో కార్యాలయానికి వచ్చిన మారుతమ్మ అనే మహిళా రైతు..తనకు పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని సిబ్బందిని నిలదీసింది. గుండాల మండలం మరిపడిగ గ్రామ వీఆర్వో శ్రీను, తన దగ్గర రూ.2 వేలు లంచం తీసుకొని పని చేయడం లేదని..పని చేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలంటూ నానా హంగామా చేసింది. ఇలా డబ్బులు తీసుకుని పనులు చేయకపోతేనే హత్యలు జరుగుతున్నాయంటూ.. రెవిన్యూ అధికారులను కార్యాలయం ముందే ఏడా పెడా వాయించేసింది . ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తుంది.

Next Story
Share it