వివాదస్పద మతగురువు నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం స్పందించింది. అసలు ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును సైతం తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. తమ దేశంలో ద్వీపాన్నిగానీ భూమిని గానీ కొనుగోలు చేసేందుకు తాము అనుమతించలేదని స్పష్టం చేసింది. అందుకే అతను ఈక్వెడార్‌ నుంచి హైతీ వెళ్లిపోయాడని చెప్పింది. అత్యాచారం కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న నిత్యానంద తమను ఒక శరణార్థిలా ఆశ్రయం కోరినమాట నిజమేనని, అయితే తాము దానిని తిరస్కరించామని ఈక్వెడార్ పేర్కొంది.

Kailaasa University

దీపం కొన్నట్టుగా వచ్చిన కథనాలన్నీ నిత్యానంద నిర్వహించే వెబ్సైట్ ఆధారంగా వచ్చినవేనని తేల్చి చెప్పింది. దీనితో ఈ స్వామిజీ తనకంటూ ఒక ప్రత్యేక దేశం, ప్రభుత్వం, జెండాను ఏర్పాటు చేసుకున్న వార్తలు వాస్తవాలు కావాలని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిత్యానంద పాస్‌పోర్ట్‌ ను 2018 కి పూర్వమే రద్దు చేసిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే కొత్త పాస్‌పోర్ట్‌కై అతను పెట్టుకున్న దరఖాస్తు ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని చెప్పింది. పిల్లల అక్రమ నిర్బంధం, ఇద్దరు మహిళల అదృశ్యం కేసులో నిత్యానంద కోసం గాలిస్తున్న గుజరాత్ పోలీసులు ఈ కథనాలతో మరింత అప్రమత్తమయ్యారు. ఆయనపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేలా ఇంటర్ పోల్ ను సంప్రదించేందుకు సహకరించాలని శుక్రవారం లేఖ రాశారు.

అంజి గోనె

Next Story