ట్రక్కులో మృతదేహాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 5:48 AM GMT
ట్రక్కులో మృతదేహాలు

లండన్‌లో దారుణం జరిగింది. ఒక ట్రక్కు కంటైనర్‌లో 39 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బల్గేరియా నుంచి ఈ కంటైనర్ వస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సహా ప్రముఖులు దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లండన్‌కి తూర్పు గ్రేస్ లోని ఒక పారిశ్రామిక పార్క్ దగ్గర ఈ కంటైనర్‌ను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్‌ని ఉత్తర ఐలాండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతులు 39 మందిలో 38 మంది పెద్దవారు ఉండగా ఒకరు టీనేజర్. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

Lundan1

ఇది రిఫ్రిజరేటెడ్ ట్రక్ కావటం, ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీలు సెల్సియస్ కంటె తక్కువగా ఉండటం వల్ల ఇందులో వలసదారులు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. బల్గేరియా నుంచి కొన్ని ముఠాలు ప్రమాదకర రీతిలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ట్రక్‌లోని మృత దేహాలకు ఆ ముఠాలకు సంబంధం ఉందేమో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.



Next Story