బేబీ షార్క్ రైమ్ పాడిన ఆందోళనకారులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 8:29 AM GMT
బేబీ షార్క్ రైమ్ పాడిన ఆందోళనకారులు

ఉద్యమకారులు రైమ్స్ పాడుతూ డాన్సులు వేయడం మీరు ఎప్పుడైనా చూసారా. అయితే ఈ వీడియో చూడండి.. ఒక చిన్నబాబును నినాదాలతో భయపెట్టొద్దు అన్న తల్లి విన్నపంతో ఆందోళకారులు ఆ కారు చుట్టూ ఎలా సందడి చేశారో. దేశ ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ గత వారం రోజులుగా లెబనాన్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద గుమిగూడిన ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు ఒక కారును అడ్డుకున్నారు. అయితే ఆ కారులో తల్లితోపాటు ఒక 15 నెలల బాబు కూడా ఉన్నాడు. దీంతో గట్టిగా అరవద్దు అంటూ ఎలిన్ ఆందోళనకారులను రిక్వెస్ట్ చేసింది. దీనితో వారు బేబీ షార్క్ అనే రైమ్‌ను పాడటం ప్రారంభించారు. 20 మంది కారు చుట్టూ తిరుగుతూ నవ్వుతూ డాన్స్ చేస్తూ ఈ రైమ్ ను పాడారు. ఈ విషయాన్ని ఎలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోను చూసిన వాళ్ళందరూ ఆందోళనకారుల సమయస్ఫూర్తికి వాహ్వా అంటున్నారు.Next Story