తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష సెంటర్ల లోపలికి అనుమతించారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు ఆదేశాల మేరకు పరీక్షకు గంటముందే విద్యార్థులు ఆయా పరీక్షా సెంటర్ల వద్దకు చేరుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.

Also Read: నిర్భయ దోషులు రేపు సూర్యోదయాన్ని చూడకపోవచ్చు..

జ్వరం, దగ్గు, జలుబు, అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను ప్రత్యేక రూమ్‌లలో పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఇక ఒక్క పరీక్షా గదిలో 24 మందికి మించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అబిడ్స్‌లోని పలు స్కూళ్ల వద్ద విద్యార్థులు, తమ తల్లిదండ్రులతో బారులు తీరారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు విద్యార్థులు ముఖానికి మాస్క్‌ ధరించి పరీక్షకు హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక వైద్యుడిని ఉంచారు. విద్యార్థులకు తాగు నీరు సౌకర్యం కల్పించారు.

Also Read: ఏపీలో మరో కరోనా పాజిటివ్‌ కేసు

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.