హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్‌ బండ్‌కు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన వలయాలను చేధించుకొని కార్మికులు దూసుకొచ్చారు. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల తోపులాట జరిగింది. ట్యాంక్‌ బండ్‌పై ఆర్టీసీ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్నారు. నిరసనకారులపై టీయర్‌ గ్యాస్‌, వాటర్‌ను పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌ మీదకు చేరుకున్న కార్మికులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. సకల జనుల సామూహిక దీక్షలో భాగంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఎంబీ భవన్‌ నుంచి సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం, విమలక్క, సీపీఎం నాయకులు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ క్రాసూ్‌ రోడ్‌లో పోలీసుల వలయాన్ని చేధించుకొని ట్యాంక్‌ బండ్‌ వైపు పోలీసులు పరుగులు తీశారు.

Rtc1

‘ఛలో ట్యాంక్‌ బండ్‌’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని కరీనంగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఖండించారు. సీఎం కేసీఆర్‌ పోలీసులతో సమ్మెను అణచాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ నుంచి పూర్తి మద్దతుంటుందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.