అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 1 Nov 2019 10:08 PM IST

అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి..!

అమెరికా:ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ అమెరికాలో అకాల మరణం పొందారు. చనిపోయిన శివ చలపతి రాజు గ్రీన్ కార్డ్ బ్యాక్‌ లాగ్ లిస్ట్ లో ఉన్నారు. దీంతో ..శివ చలపతి రాజు భార్య స్వదేశానికి తిరిగి పయనమైంది. అయితే..ఏ కారణంతో ఇతను చనిపోయాడో తెలియడం లేదు. శివ చలపతిరాజు కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది బ్యాక్‌ లాగ్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కుటుంబం నార్త్ కరోలినాలో ఉంటుంది. రాజు మృతదేహాన్ని స్వదేశం తరలించేందుకు విరాళాలు సేకరిస్తున్నారు.

Next Story