బిగ్‌బాస్-4లోకి బిత్తిరి సత్తి..!
By సుభాష్ Published on 24 Jun 2020 3:30 PM ISTబిగ్‌బాస్ రియాలిటీ షో.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి సీజన్‌లో జూ. ఎన్టీఆర్ హోస్ట్ నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు. ఇక రెండో సీజన్‌లో నేచురల్‌స్టార్ నాని, ఇక మూడో సీజన్‌లో నాగార్జున హోస్ట్ గా నిర్వహించి షోకు మంచి రేటింగ్ తీసుకువచ్చారు. ఇక బిగ్‌బాస్-4 సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగో సీజన్‌కు కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేసిన పనిలో ఉన్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. మన దేశంలో ముందుగా హిందీలో ప్రారంభం కాగా, ఆ తర్వాత ఇతర భాషల్లో ప్రారంభమైంది. ఇక నాలుగో సీజన్‌కు ఎవరు హోస్ట్ గా చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ -4 అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇక తాజాగా బిగ్‌బాస్ -4లో ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. అయితే ప్రముఖ ఛానల్‌లో చేస్తున్న బిత్తిరి సత్తి యాజమాన్యంలో పలు విబేధాలు వచ్చి మంగళవారం అందులోంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో స్టార్‌మా వాళ్లు కూడా బిగ్‌బాస్-4లో వచ్చేందుకు సంప్రదించినట్లు సమాచారం. అయితే మొదటి మూడు సీజన్‌లలో బిగ్ బాస్ నిర్వాహకులు బిత్తిరి సత్తిని సంప్రదించగా, అప్పట్లో సత్తి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఇప్పడు నాలుగో సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌గా ఇటీవల నిర్వాహకులు సత్తిని అడుగగా, ప్రముఖ ఛానల్‌లో పని చేస్తుండటంతో ఆసక్తి చూపకపోయినా.. ప్రస్తుతం సత్తి పని చేస్తున్న ఛానల్ నుంచి బయటకు రావడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిగ్‌బాస్-4లో అవకాశం రావడంతో బిత్తిరి సత్తి కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక బిత్తిరి సత్తితో పాటు మరో నాలుగురు కంటెస్టెంట్‌లను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.