బైబై అంటూ కేసీఆర్‌కు సూట్‌కేస్‌ గిఫ్ట్‌గా పంపిన షర్మిల

ఎన్నికల కౌటింగ్‌కు అధికారులు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 1:35 PM IST
ys sharmila, gift, bye bye kcr suitcase ,

బైబై అంటూ కేసీఆర్‌కు సూట్‌కేస్‌ గిఫ్ట్‌గా పంపిన షర్మిల

తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ను పక్కకు పడితే.. గెలుపుపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కౌటింగ్‌కు అధికారులు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర బలగాలు బందోబస్తులో పాల్గొననున్నాయి. రాష్ట్ర పోలీసులు కూడా భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

అయితే.. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు కేసీఆర్‌కు వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్‌ అంటూ స్టిక్కర్‌ అంటించి ఉన్న సూట్‌కేసును షర్మిల తీసుకొచ్చారు.. ఇక కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి రాదని చెప్పుకొచ్చారు. సూట్‌కేస్ సర్దుకోవాల్సిందే అని గిఫ్ట్‌ ఇస్తూ చెప్పారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. కేసీఆర్‌ అన్నీ ప్యాక్‌ చేసుకుని సూట్‌కేస్‌తో వెళ్లిపోవాలని అన్నారు.

బైబై కేసీఆర్.. కేసీఆర్ సూట్‌కేస్ పట్టుకుని సర్దుకునే టైమ్ వచ్చిందని షర్మిల అన్నారు. అన్నీ ప్యాక్ చేసుకుని పెట్టుకోవాలని అన్నారు.. అందుకే ఆయన బైబై కేసీఆర్‌ సూట్‌కేస్‌ గిఫ్ట్‌గా పంపిస్తున్నట్లు షర్మిల చెప్పారు. కేసీఆర్‌ను ఓడించాలనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు వైఎస్ షర్మిల చెప్పారు. మరోవైపు కేసీఆర్ అవినీతిపై బీజేపీ యాక్షన్‌ తీసుకుంటుందని ఆశించామని.. కానీ వారు ఏమీ చేయలేదన్నారు. ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా కనీసం చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగలు అంటూ వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అర్తం అయ్యిందనీ.. కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తున్నారంటూ షర్మిల కామెంట్స్ చేశారు.

2014, 2018 ఎన్నికల్లో 45 మందిని కేసీఆర్ కొన్నారనీ.. కేసీఆర్‌ కొన్న ఎమ్మెల్యేలు 40, ఎమ్మెల్సీలు నలుగురు, ఒక ఎంపీ ఉన్నారని షర్మిల చెప్పారు. ఇది మరోసారి రిపీట్ కావొద్దని ఆశిస్తున్నట్లు చెప్పారు. బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌కు తెర దించాలనీ.. కాంగ్రెస్‌లో క్రెడబిలిటీ ఉన్న నేతలు చాలా మంది ఉన్నారని షర్మిల అన్నారు. ఇక ఎవరు ముఖ్యమంత్రి అనేది మాత్రం కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని షర్మిల అన్నారు.

Next Story