బస్సుల్లో ఫ్రీ జర్నీతో ఇక్కట్లు.. నడిరోడ్డుపై యువతి కన్నీరు (వీడియో)

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది.

By Srikanth Gundamalla  Published on  19 Dec 2023 6:14 AM GMT
young girl, cried,  rtc bus, jagtial,

 బస్సుల్లో ఫ్రీ జర్నీతో ఇక్కట్లు.. నడిరోడ్డుపై యువతి కన్నీరు (వీడియో)

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండింటిని అమలు చేస్తోంది. ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున మహిళలు బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. కనీసం కాలుపెట్టే చోటు కూడా ఉండటం లేదు. మహాలక్ష్మి పథకం కారణంగా ఫ్రీ జర్నీ ఏమో కానీ.. ఇక్కట్లు మాత్రం పడుతున్నారు ప్రజలు. బస్సులు ఎక్కువగా లేని రూట్లలో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రోజూ కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థి, విద్యార్థులను ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. యువతులు కూడా ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. యువకులు అయితే.. బస్సు వెనకాల వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు.

తాజా ఓ యువతి బస్సు ఎక్కలేని పరిస్థిలో ఉండిపోయింది. జనాలు ఎక్కువగా ఉండటంతో ఖాళీ లేదు. దాంతో.. ఆ యువతి కన్నీరు పెట్టుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. ఈ సంఘటన జగిత్యాలలో జరిగింది. తమ గ్రామానికి అదే చివరి బస్సు అనీ.. అది వెళ్లిపోతే తాను ఇంటికి ఎలా వెళ్లాలని వాపోయింది. అయితే.. ఆ అమ్మాయి కాలేజీ అయ్యాక బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూసింది. చివరి బస్సుకు ఆమె తన గ్రామానికి వెళ్లాల్సి ఉంది. ఈక్రమంలో.. ఆ బస్సు పూర్తిగా నిండిపోవడంతో కనీసం నిలబడే చాన్స్‌ కూడా లేదని..ఎలా వెళ్లాలంటూ వాపోయింది. కొత్త బస్సులు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక కొందరు విద్యార్థులు అయితే ఇదే బస్సు వెనకాల ఉండే మెట్లపై నిల్చొని ప్రయాణం చేస్తున్నారు. ఏమాత్రం కాలు జారినా కిందపడితే ప్రమాదమే.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం పనికిరాని హామీలు ఇచ్చి పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ మండిపడుతున్నారు. రోజూ బస్సుల్లో కాలేజీలకు వెళ్లే విద్యార్థీనివిద్యార్థులకు దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.

Next Story