యాదాద్రి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు.
By Srikanth Gundamalla Published on 25 May 2024 3:15 PM ISTయాదాద్రి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో భారీగా ఉంటుంది ఇక్కడ భక్తుల రద్దీ. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన ఈ పుణ్యక్షేత్రంలో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యం కోసం యాదాద్రి ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
యాదాద్రిలో ఇక నుంచి భక్తులు తిరుమల తరహాలోనే స్వామి వారి దర్శనంతో పాటుగా ఆర్జిత సేవలు కూడా ఆన్‌లైన్‌లో బుక్ బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్లను అలాగే ఆర్జిత సేవా టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని అనుకునే భక్తులు yadadritemple.telangana.gov.in. వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఈవో చెప్పారు. అంతేకాదు.. ఇదే సైట్ ద్వారా భక్తులు స్వామి వారి ఈ-హుండీకి విరాళాలు కూడా ఇవ్వొచ్చని అన్నారు. ఇక ఆన్‌లైన్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలను బుక్ చేసుకోవచ్చని యాదాద్రి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఇక యాదాద్రిలో వీఐపీ, వీవీఐపీలు, సిఫార్సులపై వచ్చే భక్తులకు రూ.300 టికెట్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శ్రీఘ్ర దర్శనం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ.. అన్ని సేవలను ఇకపై ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యాదాద్రి దేవస్థానం అధికారులు చెప్పారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చామని వారు వెల్లడించారు.