తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ తన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 12:32 PM ISTతెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ తన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. వారికి ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త వినిపించింది. ముందుగా రిజర్వేషన్ చేసుకునే వారికి రిజర్వేషన్ చార్జీలను టీఎస్ ఆర్టీసీ మినహాయిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే.. దీని కోసం ప్రయాణికులు 8 రోజులు ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్టు చేసి వెల్లడించారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
కాగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే యాత్రికులకు కూడా టీఎస్‌ఆర్టీసీ ఇటీవల శుభవార్త చెప్పింది. యాత్రికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న యాజమాన్యం.. బస్సు సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి వీటిని పెంచాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ బస్సులు ఎంజీబీఎస్, జీబీఎస్, బీహెచ్‌ఈఎల్, ఇతర ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. బస్సుల మధ్య సగు ఫ్రీక్వెన్సీ అరగంట ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ వివరించింది. మొదటి బస్సు ఉదయం 3.30 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయల్దేరుతుందని.. అలాగే చివరి బస్సు రాత్రి 11.45 గంటలకు బయల్దేరుతుందని చెప్పారు. మొదటి బస్సు శ్రీశైలం నుండి ఎంజీబీఎస్ నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరుతుంది.