ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్
తాజాగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 3:33 AM GMTప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది. తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేస్తోందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ పేర్కొన్నారు. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు.
మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తోందని చెప్పారు. త్వరలో కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నాయని చెప్పారు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు వాటిని నడిపేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంను సంస్థ అమలు చేస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్ ల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించిన ఫైలట్ ప్రాజెక్ట్ దిల్ సుఖ్ నగర్, బండ్లగూడ డిపోల్లో అమలవుతోందన్నారు.