TSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌లో ట్విస్ట్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌లో ట్విస్ట్ వచ్చింది.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 12:31 PM ISTTSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌లో ట్విస్ట్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌లో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. జనార్దన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్‌భవన్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
అయితే.. పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులు ఎవరో తేలేవరకు ఆయన రాజీనామాను ఆమోదించవద్దని గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం అనంతరం టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవికి జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారనీ.. రాజభవన్ కూడా ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపిందని ప్రచారం జరిగింది. కానీ.. గవర్నర్ తమిళిసై జనార్ధన్‌రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలపలేదని తాజాగా రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.
టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారిగా ఉన్న జనార్ధన్‌రెడ్డి 2021 మే 20న అప్పటి ప్రభుత్వం నియమించింది. మే 21న ఆయన టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం కమిషన్‌లో బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కోట్ల అరుణకుమారి, సుమిత్రానంద్ తనో బా సభ్యులుగా కొనసాగుతున్నారు. గతంలో జనార్ధన్‌రెడ్డి న్లగొండ, నెల్లూరు ఆర్డీవోగా పనిచేశారు. అంతేకాదు.. వరంగల్, అనంతపురం కలెక్టర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్, మార్కెటింగ్ శాఖలతోపాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేశారు. విద్యాశాఖ సెక్రటరీగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.