తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 993పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,66,042పాజిటవ్ కేసులు నమోదు కాగా, 1441 మంది మృతి చెందారు. ఇక తాజాగా కోలుకున్న వారు 1,150 మంది ఉండగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,53,715కు చేరింది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.54 ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది.
ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 95.36 శాతం ఉండగా, దేశంలో 93.7 శాతం ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10,886,హోం ఐసోలేషన్‌లో 8,594 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 161 కేసులు నమోదయ్యాయి.