తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 721 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,75,261 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,480 మంది మృతి చెందారు. తాజాగా 753 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,66,120 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,661 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 5,576 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది.అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.67శాతం ఉండగా, దేశంలో 94.6శాతం ఉంది.
తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.