తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే

TS covid update .. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 593 పాజిటివ్‌ కేసులు నమోదు

By సుభాష్  Published on  30 Nov 2020 3:59 AM GMT
తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 593 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,69,816 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,1,458 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1058 ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 2,58,336 ఉంది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,022 ఉండగా,

హోం ఐసోలేషన్‌లో 7,946 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా జీహెచ్‌ఎంసీలో 119 పాజిటివ్‌ కేసులు, రంగారెడ్డి 61, మేడ్చల్‌ మల్కాజిగిరి 55 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it