తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 761 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,67,665 పాజిటివ్ కేసులు నమోదు కాగా,1,448 మంది మృతి చెందారు. ఇక తాజాగా కోలుకున్నవారు 702 ఉండగా, ఇప్పటి వరకు 2,55,378 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,839 ఉండగా,హోం ఐసోలేషన్‌లో 8,651 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 95.40శాతం ఉండగా, దేశంలో 93.6 శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.