ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై భారీగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు
సాధారణంగా పట్టణాల్లో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి.
By Srikanth Gundamalla Published on 24 March 2024 12:09 PM GMTఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై భారీగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు
సాధారణంగా పట్టణాల్లో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి. కొన్ని సందర్బాల్లో ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేయడం లేదంటే.. రాంగ్ రూట్‌లో వెళ్లడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటివి పెట్టుకోకపోవడం వల్ల చలాన్లు పడతాయి. అయితే.. కొందరు మాత్రం వాటిని తిరిగి వెంటనే చెల్లించరు. మరోసారి ట్రాఫిక్ పోలీసులు ఆపి ఫైన్ కడితేనే తిరిగి బండి ఇస్తామంటేనే స్పందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు ఆఫర్ ఇచ్చింది. రాయితీలు ప్రకటించింది. అయినా కూడా ఇప్పటికీ ఇంకా పెండింగ్ చలాన్లు భారీగానే ఉన్నాయి.
తాజాగా ఓ ఎంపీ వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్ల విషయం వెలుగులోకి వచ్చింది. భారీ చలాన్లు ఉన్నా ఆయన రోడ్లపై రయ్ మంటూ తిరిగేస్తున్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాడుతోన్న కారుపై ఏకంగా రూ.10,485 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అసదుద్దీన్ కారు TS11EV 9922 రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న DEFFENDAR కారుపై ఈ మొత్తం పెండింగ్ చాలన్ ఉంది. ఓఆర్ఆర్‌పై హైస్పీడ్‌గా వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ ఫైన్ విధించారు. 2021 నుంచి ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వాలు రాయితీని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా కూడా అసదుద్దీన్ పెండింగ్ చలాన్లను క్లియర్ చేయకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక అతివేగంగా వెళ్లిన చలాన్లు ఉండటంతో.. ప్రజాప్రతినిధులే ఓవర్ స్పీడ్‌గా వెళ్తే ఎలా అంటున్నారు ప్రజలు. ఇక పోలీసులు పెండింగ్ చలాన్లు కట్టకుండా ఉంటున్న ప్రతి ఒక్కరి నుంచి వసూలు చేయాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.