సూరారంలో విచిత్ర ఘటన.. పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ

మేడ్చల్‌ జిల్లా సూరారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  15 Dec 2023 3:16 PM GMT
thief, escape, pond, medchal, suraram ,

సూరారంలో విచిత్ర ఘటన.. పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ

మేడ్చల్‌ జిల్లా సూరారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా దొంగలు ఎవరూ లేని సమయం చూసుకుని అర్ధరాత్రి వేళలో చోరీలకు పాల్పడుతుంటారు. అయితే.. ఇక్కడ ఒక దొంగ మాత్రం ఎవరూ లేనిది చూసుకున్నాడు కానీ.. ఉదయం వేళే ఇంటికి కన్నం వేయాలని భావించాడు. అనుకున్నట్లుగానే ఇంట్లోకి వెళ్లాడు. దొంగతనం చేసి ఇంటి నుంచి పారిపోయే లోపు యజమాని వచ్చేశాడు. ఆ తర్వాత తప్పించుకునే క్రమంలో పోలీసులకు సదురు దొంగ చుక్కలు చూపించాడు.

కుత్పుల్లాపూర్‌ నియోజకవర్గం సురారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడ్డాడు దొంగ. యజమాని రాకముందే అన్ని సర్దేసి గుల్లచేసి పారిపోదాం అనుకున్నాడు. అంతలోనే ఇంటి యజమాని వచ్చేశాడు. దొంగ షాక్ తిన్నాడు. దొరికితే చితకబాదుతారని భావించి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు. దాంతో.. ఇంటి నుంచి పరుగు మొదలుపెట్టాడు. దొంగను చూసిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అతడినే ఫాలో అయ్యాడు. చివరకు దొంగ పరిగెత్తి చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికీ ఇంటి యజమాని అతన్ని చేజ్‌ చేస్తూ వెళ్లాడు. తప్పించుకునేందుకు దొంగ చెరువులోకి దూకాడు.

చెరువులో ఈదుతూ నీటి మధ్యలో ఉన్న బండరాయిపైకి చేరాడు. ఇక చివరకు పోలీసులు కూడా సంఘటనాస్థలానికి చేరుకున్నాడు. నువ్వు దొరికిపోయావు.. ఇక ఒడ్డుకు రావాలని ఎంత పిలిచినా రాలేదు. సాయంత్రం చెరువులో దూకిన దొంగ.. రాత్రి అవుతున్నా ఒడ్డుకు చేరలేదు. పోలీసులు, సుదురు ఇంటి యజమాని దొంగ కోసం ఒడ్డువద్దే వేచి చూస్తున్నారు. దొంగను ఎలాగైనా పట్టుకోవాలని పోలసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఒక ఇంట్లో చోరీ చేసి చెరువులో దూకేసి.. అక్కడే బండపై కూర్చున్నాడనే విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి దొంగ చెరువు మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.



Next Story