alangana: 119 నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు కోసం నిధులను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 4:15 PM GMTTalangana: 119 నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు కోసం నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులను కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మొత్తం రూ.1,190 కోట్లను మంజూరు చేసింది. జిల్లా ఇంచార్జ్ మంత్రుల ఆమోదంతో ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలో విద్యాసంస్థలకు రూ.2 కోట్లు, మంచినీటి కోసం రూ. కోటి ఖర్చు చేయాలని స్పష్టంగా పేర్కొంది. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల మెయింటేనెన్స్ కోసం రూ.50 లక్షల చొప్పున ఖర్చు చేయాలని జీవోలో పేర్కొంది. ఈ మొత్తాన్ని ఆయా జిల్లా ఇంచార్జ్‌లకు మంజూరు చేసింది.
ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన నిధులు.. ఇంచార్జ్ మంత్రులు:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. 13 నియోజకవర్గాలు: రూ.130 కోట్లు కేటాయింపు (ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ )
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.. 14 నియోజకవర్గాలు: రూ.140 కోట్లుకేటాయింపు (ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలు: రూ.100 కోట్లు కేటాయింపు (ఇంఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి )
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా... 14 నియోజకవర్గాలు: రూ.140 కోట్లు కేటాయింపు (ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు)
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలు: రూ.120 కోట్లు కేటాయింపు (ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి )
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలు: రూ.150 కోట్లు కేటాయింపు (ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ )
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలు: రూ.100 కోట్లు కేటాయింపు, (ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాలు: రూ.100 కోట్లు కేటాయింపు, (ఇంఛార్జ్ మంత్రి సీతక్క)
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు: రూ.120 కోట్లు కేటాయింపు, (ఇంఛార్జ్ మంత్రి తుమ్మల )
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలు: రూ.90 కోట్లు కేటాయింపు, (ఇంఛార్జ్ మంత్రి జూపల్లి )