రూ.500కే గ్యాస్ సిలిండర్ గైడ్‌లైన్స్ విడుదల.. వారికి షాక్!
మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలుకోసం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla
రూ.500కే గ్యాస్ సిలిండర్ గైడ్‌లైన్స్ విడుదల.. వారికి షాక్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలవుతుండగా.. మరో రెండింటిని అమలు చేసేందకు కసరత్తులు చేసింది. అయితే.. ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలుకోసం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఎవరు అర్హులో జీవోలో పేర్కొంది.
మహిళల ఆరోగ్యాన్ని పొగబారి నుంచి కాపాడుతూ.. వారికి విముక్తి కలిగించడమే మహాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అర్హులు ఎవరనేదానిపై నిబంధనలను తెలిపింది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం.. మహాలక్ష్మి పథకం కోసం ప్రజాపాలన అప్లికేషన్‌లో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం ద్వారా రూ.500 కే గ్యాస్ సిలిండర్‌ను అందించనుంది ప్రభుత్వం. అంతేకాదు.. గ్యాస్ కనెక్షన్ మహిళ పేరుమీద ఉండాలనే నిబంధన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక గడిచిన మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని వర్తింప జేయనున్నారు అధికారులు. ఇక సబ్సిడీ గ్యాస్ పేమెంట్‌ను ఆయా గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం ప్రతి నెలా చెల్లింపులు చేయనున్నట్లు గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.
త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని గ్యారెంటీల అమలుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇతర గ్యారెంటీల అమలు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. కాగా.. గ్యాస్ కనెక్షన్ మహిళల పేర్లపై కాకుండా పురుషుల పేర్లతో ఉన్నవారికి మాత్రం షాక్‌గానే పేర్కొంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ గైడ్‌లైన్స్ విడుదల
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 27, 2024
గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
* ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నవారు అర్హులు
* ఈ పథకం కోసం తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి
* గ్యాస్ కనెక్షన్ మహిళ పేరుపైనే ఉండాలని గైడ్‌లైన్స్
* గడిచిన మూడేళ్లుగా… pic.twitter.com/Wnixp4mvri