గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువ: చిదంబరం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మద్య విమర్శలు వేడెక్కుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 9:39 AM GMT
telangana elections, chidambaram,   govt,

గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువ: చిదంబరం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మద్య విమర్శలు వేడెక్కుతున్నాయి. ఎలాగైనా అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా.. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. గ్యాస్‌ సిలిండర్ ధరలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో అర్బన్ నిరుద్యోగం దేశంలో కన్నా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో విఫలం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంతో ఉన్నారని ఈ కోపాన్ని నవంబర్ 30న ఓటు రూపంలో చూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిందబంరం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీంతో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని స్పష్టం చేశారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని చిదంబరం తెలిపారు. అంతేకాదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. రుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు చిదంబరం.

తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు. ప్రతి పౌరుడిపై లక్ష రూపాయలకు పైగా అప్పు ఉందన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మాట తప్పకుండా తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్సే అన్నారు చిదంబరం. కాంగ్రెస్‌ ఎందుకోసం తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అందుకే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పాలని.. కాంగ్రెస్‌ సర్కార్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజలకు పి.చిదంబరం పిలుపునిచ్చారు.

Next Story