మంత్రి పొంగులేటి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
ప్రయాణికులంతా విమానంలో ఎక్కిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్లు.
By Srikanth Gundamalla Published on 14 May 2024 7:43 AM GMTమంత్రి పొంగులేటి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
విమానాలు అప్పుడప్పుడు టేకాఫ్‌కు సమయం తీసుకుంటాయి. కొన్నిసమయాల్లో వాతావరణంలో వచ్చే మార్పులు కావొచ్చు.. ఇంకొన్నిసార్లు విమానంలో ఏదైనా సమస్య ఉంటే టేకాఫ్ లేట్ అవుతుంది. తాజాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో.. ఇండిగో 6ఏ 6707 విమానం దాదాపు గంటన్నర సేపు రన్‌వేపైనే ఉండిపోయింది. హైదరాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్లాల్సిన సమయంలో ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది.
అయితే.. ప్రయాణికులంతా విమానంలో ఎక్కిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్లు. దాంతో.. ఆ విమానంలో దాదాపు గంటన్నర సేపు రన్‌వేపైనే నిలిచిపోయింది. ఇదే విమానంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు ఇతర నాయకులు ఉన్నారు. గంట సమయం గడిచినా విమానం టేకాఫ్ తీసుకోకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. విమాన సిబ్బంది వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం ఉంటే.. ముందుగానే ఎందుకు ప్రయాణికులను ఫ్లైట్‌లో ఎక్కించారంటూ మండిపడ్డారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన టెక్నీషియన్స్ లోపాన్ని గుర్తించే పనిలో పడ్డారు. ఇంకా రన్‌వేపైనే ఉంది విమానం. మంత్రి పొంగులేటితో పాటు ఇతర నాయకులు, ప్రయాణికులు విమానంలో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు టేకాఫ్ తీసుకుంటుందా అని కూర్చున్నారు. ప్రయాణికులు విమానంలో వెయిట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి పొంగులేటి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 14, 2024
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై నిలిచిపోయిన ఇండిగో విమానం pic.twitter.com/okcaa3TxiL