మంచి ఐడియా ఇవ్వండి.. రూ.లక్ష గెలవండి, స్మితా సబర్వాల్ పోస్ట్

ఇటీవల సోషల్ మీడియలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంచలనంగా ఆరిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla
Published on : 19 Aug 2024 7:11 AM IST

smita sabharwal, bumper offer, one idea,  one lakh rupees,

మంచి ఐడియా ఇవ్వండి.. రూ.లక్ష గెలవండి, స్మితా సబర్వాల్ పోస్ట్

ఇటీవల సోషల్ మీడియలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంచలనంగా ఆరిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. ఒక్క మంచి ఐడియా ఇవ్వండి.. రూ.లక్ష గెలుచుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం అప్పుల భారంతో ఉందన్న విషయం తెలిసిందే. ఎంత కష్టమైనా సరే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తోందనీ ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ కొత్త ఐడియాలకు ఆహ్వానం పలికారు.

తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలతో పాటు గ్రామాల నుంచి ఆదాయం సృష్టించే ఇన్నోవేషన్ ఐడియాలను.. నెటిజన్ల నుంచి ఆహ్వానించారు స్మితా సబర్వాల్. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఐడియాథాన్ పేరుతో ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం అమలు చేసే విధానాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎవరైనా ప్రభుత్వానికి ఆదాయం సృష్టించే మార్గాల గురించి అదిరిపోయే ఐడియా ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే ఐడియా నచ్చితే దానిని ఫ్రీగా తీసుకోమనీ.. రూ.లక్ష ఇస్తామని స్మితా సబర్వాల్ ప్రకటించారు. విజన్‌ను పూర్తిగా ప్రభుత్వానికి వివరించాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి 2024 సెప్టెంబర్ 30 చివరి తేదీగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం.. tgsfc2024@gmail.com ను కూడా సంప్రదించొచ్చని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని అస్సలు మిస్సవ్వొద్దు అని కూడా చెప్పారు స్మితా సబర్వాల్.



Next Story