సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కేవలం రూ.100 రూపాయల కోసం ఏటీఎంను ధ్వంసం చేశాడు. తన అవసరానికి ఏటీఎంల నుంచి డబ్బులు రావడం లేదనే కోపంతో రాయితో ఏటీఎంను పగలగొట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ ఈ సంఘటన గురించి వివరాలను తెలిపారు. స్థానిక ఎస్బీఐ బ్యాంకు పక్కనే ఏటీఎంను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి సిద్దిపేట చౌరస్తాలో ఓ ఏటీఎం సెంటర్ ఉంది. అక్కడకు వచ్చిన సాదక్ అనే వ్యక్తి రూ.100 కోసం ప్రయత్నించాడు. కాని.. ఏటీఎంలో నుంచి డబ్బులు రాలేదు.దాంతో.. అతను మరో ఏటీఎంలో ట్రై చేయడాకి వెళ్లాడు. ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్లి నగదు కోసం ప్రయత్నించాడు. కానీ.. అక్కడ కూడా డబ్బులు రాకపోవడం రాయితో ఏటీఎంను పలుమార్లు కొట్టాడు. మొదటగా గుర్తు తెలియని వ్యక్తం చోరికి యత్నించాడని శుక్రవారం ఫిర్యాదు చేశారు బ్యాంకు సిబ్బంది. ఆ తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించగా.. చోరీకి యత్నించిన వ్యక్తి సాదక్గా తేల్చామని పోలీసులు చెప్పారు. బ్యాంకు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.