ఉరేసుకున్న వ్యక్తికి సీపీఆర్‌ చేసి పునర్జన్మనిచ్చిన ఎస్‌ఐ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఓ ఎస్‌ఐ సీపీఆర్ చేసి ఓ వ్యక్తికి పునర్జన్మనిచ్చాడు.

By Srikanth Gundamalla  Published on  18 Feb 2024 5:58 AM GMT
SI,  CPR,  hanged man,  ibrahimpatnam,

ఉరేసుకున్న వ్యక్తికి సీపీఆర్‌ చేసి పునర్జన్మనిచ్చిన ఎస్‌ఐ

ఇటీవల కాలంలో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. అయితే.. కొన్ని సందర్బాల్లో పక్కనే ఎవరైనా గమనించి సీపీఆర్‌ చేస్తే మాత్రం బతికే అవకాశాలు ఉంటున్నాయి. ఇలా గుండెపోటుకు గురైన వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా కొందరు బతికారు. వీటికి సంబందించిన వీడియోలను చాలా చూశాం. ఇటీవల యాదాద్రి జిల్లాలో మహిళకు గుండెపోటు రాగా.. స్థానిక ఎస్‌ఐ సీపీఆర్‌ చేసి ఆమె ప్రాణాలు కాపడాడు. ఇప్పుడు తాజగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఓ ఎస్‌ఐ సీపీఆర్ చేసి ఓ వ్యక్తికి పునర్జన్మనిచ్చాడు.

పశ్చిమబెంగాల్‌కు చెందిన ముఖర్జీ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే.. అతని కుటుంబంలో కలహాలు ఉన్నాయి. కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విసిగిపోయిన అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. దాంతో.. ఇబ్రహీంపట్నం శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నారు. ఇక కొందరు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దగ్గరే కావడంతో స్థానిక ఎస్ఐ మైబెల్లి స్పాట్‌కు వెంటనే వెళ్లాడు. అప్పటికే అతను చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. అందరూ ముఖర్జీ చనిపోయాడని అనుకున్నారు.

కానీ.. ఎస్‌ఐ మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహించాడు. ముఖర్జీని వెంటనే చెట్టు నుంచి కిందకు దించి.. కింద పడుకోబెట్టి సీపీఆర్ చేశాడు. అలా చాలా సేపు సీపీఆర్‌ చేసి సదురు వ్యక్తి ఊపిరి తీసుకునేలా చేశారు. కొద్దిసేపటికే శరీరంలో కదలిక వచ్చింది. అతను కదలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ముఖర్జీని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముఖర్జీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చినపోయాడు అనుకున్న వ్యక్తిని సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి బతికించిన ఎస్‌ఐ మైబెల్లిని ఉన్నతాధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు.

Next Story