పార్కుల్లో పాడు పనులు చేసే జంటలపై షీటీమ్స్ నిఘా
బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీటీమ్స్ దృష్టి సారించాయి.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 8:30 AM ISTపార్కుల్లో పాడు పనులు చేసే జంటలపై షీటీమ్స్ నిఘా
ప్రేమ జంటలు ఈ మధ్యకాలంలో బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. చుట్టుపక్కల జనాలు ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా రొమాన్స్‌లో మునిగి తేలుతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో అనైతిక చర్యలకు పాల్పడటం వల్ల పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న ఇతరులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే షీటీమ్స్ ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీటీమ్స్ దృష్టి సారించాయి. నెక్లెస్‌రోడ్డు, ఇందిరాపార్క్, కృష్ణకాంత్ పార్కులతో పాటు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన జంటలను శుక్రవారం షీటీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపత్యంలో 12 మందిని అదుపులోకి తీసుకున్న షీటీమ్స్ వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ తర్వాత వారికి ఫైన్ విధించారు కూడా. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే.. నెక్లెస్ రోడ్డుతో పాటు ఇతర పార్కుల్లో నిరంతరం షీటీమ్స్ నిఘా ఉంటుందని వెల్లడించారు. ఇక మహిళలపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా, ఇబ్బందులు పెట్టినా షీటీమ్స్ వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు జంటలు బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దనీ.. అలా చేస్తే చర్యలు తప్పవని పోలీసులు చెప్పారు.